© 2026 nimisham.in

4GB + 128GB వేరియంట్ ధర రూ. 14,499 మాత్రమే ఈ ఫోన్లో UFS 2.2 స్టోరేజ్, 1TB వరకు పెంచుకోవచ్చు బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా కూడా ఉంది Lava Virat V1 5G : వావ్.. లావా నుంచి కిర్రాక్ ఫోన్..
128GB వేరియంట్లో లావా కొత్త ఫోన్ వచ్చేసింది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్, లావా విరాట్ V1 5జీ పేరుతో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. ఈ లావా ఫోన్ భారత మార్కెట్లో ఫస్ట్ టైమ్ గత జూలైలోనే వచ్చింది. అయితే, అది 4GB + 64GB అనే సింగిల్ వేరియంట్ మాత్రమే. కానీ, ఇప్పుడు కంపెనీ హై స్టోరేజ్ వేరియంట్ కూడా తీసుకొచ్చింది. ఈ ఫోన్లో 128GB స్టోరేజ్ ఆప్షన్ అందిస్తుంది. ఈ కొత్త వేరియంట్ ధర, స్పెషల్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. భారత్‌లో 128GB ధర ఎంత? : కంపెనీ లావా విరాట్ V1 5జీ ఫోన్ 128GB వేరియంట్‌ను లాంచ్ చేసింది. గతంలో ఈ ఫోన్ కేవలం 4GB + 64GB కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభించేది. ఇప్పుడు 128GB వేరియంట్ కూడా లభిస్తోంది. ఈ ఫోన్ కేవలం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంది. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 14,499 కాగా, కంపెనీ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభ్యమవుతోంది. లావా విరాట్ V1 5జీ స్పెసిఫికేషన్లు : ఈ లావా 5జీలో HD+ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేసే 6.75-అంగుళాల LCD ప్యానెల్ ఉంది. స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ప్రాసెసింగ్ కోసం యూనిసోక్ T8200 చిప్సెట్ అమర్చారు. Read Also : Japan 6G Device : 5G కన్నా 20 రెట్లు స్పీడ్.. 6Gతో జపాన్ సంచలనం.. 112 Gbps స్పీడ్‌తో ప్రయోగం! అలాగే, 8GB వర్చువల్ ర్యామ్, 64GB, 128GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్లో UFS 2.2 స్టోరేజ్ కూడా ఉంది. 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా ఉంది. 5MP సెల్ఫీ కెమెరా అందిస్తుంది. ఈ ఫోన్‌కు భారీ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. USB-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్ అందిస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ కేవలం 10W ఛార్జర్‌ను మాత్రమే అందిస్తుంది. ఈ ఫోన్లో 5G, 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. సెక్యూరిటీ కోసం పక్కన ఫింగర్‌ప్రింట్ స్కానర్ అమర్చారు. అలాగే స్పీకర్ మంచి సౌండ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ అందిస్తుంది.