© 2026 nimisham.in

నవీపేట: నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన రమావత్ సాయికిరణ్ (25) గోదావరి నదిలో పడి చనిపోయాడు.
యూకేలో ఎంబీఏ చేస్తున్న అతడు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న తిరిగి యూకే వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం బాసర ఆలయానికి సాయికిరణ్ వెళ్లాడు. దర్శనం అనంతరం బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. విషయం తెలుసుకుని కుటుంబసభ్యులు గాలింపు చేపట్టగా బుధవారం అతడి మృతదేహం లభ్యమైంది. తండ్రి రమావత్ భోజారామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పీఎస్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.