© 2026 nimisham.in

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక అవడంతో ఉదయం నుంచి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చారు.
అయితే నేడు పవన్ పుట్టినరోజు కానుకగా తన నెక్స్ట్ సినిమాల్లో ఏ సినిమా నుంచి అప్డేట్ ఉంటుందని చూస్తున్న నేపథ్యంలో దర్శకుడు సుజిత్ ఈ సాయంత్రం ఓజి 2 సినిమా నుంచి చిన్న అప్డేట్ ఉంటుందని ప్రామిస్ చేశాడు.
ఇక అనుకున్న సమయానికే అప్డేట్ ను రివిల్ చేసి ఫ్యాన్స్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ని దర్శకుడు సుజిత్ అలాగే సంగీత దర్శకుడు థమన్ అందించారు. ఇక ఈ వీడియోలో పవన్ తో కలిసి సుజిత్, థమన్ గత కొన్నాళ్ల క్రితం చేసిన ప్రిపరేషన్ వీడియో వదిలారు. ఇందులో ఓజి 2 యూనివర్స్ ఏ రేంజ్ లో ఉండాలి, ఎలా ఉండాలి అనే ఇంట్రెస్టింగ్ అంశాలు వారు డిస్కస్ చేసుకున్నారు.
వీటితో పాటుగా యానిమేషన్ క్లిప్స్, థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హంగ్రీ చేత ఆడియోకి మరో కొత్త వర్షాన్ని తమ ప్రజెంట్ చేయడం ఇందులో ఫ్యాన్స్ కి మరింత సర్ప్రైజింగ్ అనిపించింది. దీనితో ఈసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఈ అప్డేట్ డాన్స్ లో ఫుల్ జోష్ ని నింపింది.