© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Womens Turn Waste Into Wealth: చెత్త.. అనే పదం వినగానే అందరూ ముక్కు మూసుకుంటూ ఉంటారు.. అలాంటిది ఆ చెత్తనే తమ సంపాదనగా మార్చుకున్నారు త్రిపుర రాష్ట్రంలోని కోవాయ్ పట్టణానికి సంబంధించిన 100 మంది మహిళలు.. ఒకప్పుడు సమాజంలో చెత్త ఏరుకునే వారు అని పిలుచుకుంటూ అగౌరవానికి గురైన వారు.. ఇప్పుడు ఏకంగా ఒక వ్యవస్థకే యజమానులుగా మారారు.. వారి కృషితో ఇప్పుడు పట్టణం చెత్త కుండీలు లేని నగరంగా మారిపోయి దేశానికే ఆదర్శనీయంగా నిలిచింది.
పింకీ కర్ దేబ్ అని మహిళ గత తొమ్మిదేళ్లుగా చెత్తను సేకరించే పని చేసే వారట.. ఎలాంటి గ్లౌజులు లేకుండా.. చేతులతోనే చెత్తను వేరు చేసేదట.. మురుగు వాసన వచ్చే ఆ చెత్తలో పని చేస్తుంటే.. అటుగా వెళ్లే వారంతా ముక్కున వేలేసుకునే వారట.. కానీ నేడు పరిస్థితి ఊహించని స్థాయిలో మారింది.. పింకీ ఇప్పుడు ఒక చెత్త నిర్వాహణ కేంద్రానికి ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టింది.. మాస్క్ లేకుండా దర్జాగా తన ఆఫీసులో కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆమె ఒక కార్మికురాని స్థాయి నుంచి ఓనర్ స్థాయికి ఎదిగారు..
ఈ మార్పు వెనక ఒక ఐఏఎస్ అధికారి ఆలోచన కూడా ఉంది. కోవాయ్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) నిర్మల్ కుమార్ ఒకసారి గుజరాత్ లోని అముల్ కోఆపరేషన్ సందర్శించింది.. అదే తరహాలో పారిశుద్ధ్య కార్మికులతో ఎందుకు ఒక సొసైటీని ఏర్పాటు చేయకూడదు అన్న ఆయన ఆలోచనే..కోవాయ్ వేస్ట్ టు వెల్త్ ప్రొడ్యూసర్ సొసైటీ బీజం వేసినట్లు తెలుస్తోంది. దీనికి బెంగళూరులో చెత్త నిర్వహణపై శిక్షణ పొందిన సమీర్ అగర్తలా అనే 31 ఏళ్ల యువకుడు సాంకేతిక సహకారం అందించారు..
ఈ సొసైటీలో 100 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.. వీరే స్వయంగా మొత్తం చెత్త నిర్వహణ వ్యవస్థను నడుపుతున్నారు.. ప్రతిరోజు ఉదయం 7 గంటలకే రంగంలోకి దిగి ఇంటికి వెళ్లి చెత్తను సేకరిస్తారు.. అంతేకాకుండా తడి చెత్త తో పాటు పొడి చెత్తను వేరుగా చేస్తారట.. అలాగే వీరు ఇంటి యజమానులకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయమని కూడా సూచిస్తూ ఉంటారట. మొదట్లో సహకరించని వారి ఇళ్ళ ముందే కూర్చుని.. దుర్వాసన కొట్టే చెత్తను తమ చేతులతో వేరు చేస్తూ మీరు ఇంట్లో చేసే చిన్న పని మా జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తుందో చూడండి అని ప్రాక్టికల్ గా చూపించారు. దీంతో ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చి ఇప్పుడు 90% ఇల్లు చెత్తను వేరు చేస్తున్నారని సొసైటీ తెలిపింది..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
వారంతా రోజు దాదాపు 1500 కిలోలకు పైగా పొడి చెత్త తో పాటు.. 3000 కిలోలకు పైగా తడి చెత్తను సేకరించి రీసైకిల్ ఇంకు పంపుతున్నారు. ఆరు మెటీరియల్ రికవరీ కేంద్రాలతో పాటు 55 గుంతలు ఉన్న మైక్రో కంపోసింగ్ కేంద్రాల ద్వారా తడి చెత్తను రోజుకు 500 కిలోల కంపోస్ట్ ఎరువుగా మారుస్తున్నారు.. ఒకప్పుడు వీధుల చివర నిండిపోయిన దుర్వాసన వెదజల్లే చెత్తకుండీలన్నీ ఇప్పుడు మాయమయ్యాయి.. ఆ ప్రదేశాల్లో చిరు వ్యాపారుల కోసం చిన్న చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేశారు. బరువైన పనుల కోసం ఈ మహిళలే పురుషులను పనిలోకి పెట్టుకుని జీతాలు ఇవ్వడం విశేషం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.