© 2026 nimisham.in

దులీప్ ట్రోఫీ 2026/27 సీజన్లో సౌత్ జోన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నార్త్ జోన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు.
ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందించి, టైటిల్ పోరుకు అర్హత సాధించేలా చేశాడు. సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది.మ్యాచ్ చివరి రోజు 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ జోన్‌కు కెప్టెన్ తిలక్ వర్మ (79 బంతుల్లో 51 నాటౌట్) అండగా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కీలకమైన సెంచరీ (116 నాటౌట్)తో జట్టును ఆదుకున్న తిలక్, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. రవిచంద్రన్ స్మరణ్ (32 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్‌కు అబేధ్యంగా 80 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.అంతకుముందు నాలుగో రోజు ఆట ప్రారంభించిన నార్త్ జోన్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని భావించింది. అయితే, సౌత్ జోన్ పేసర్ ఎండీ నిధీశ్ వారి ప్రణాళికలను దెబ్బతీశాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి నార్త్ జోన్ పతనాన్ని శాసించాడు. చివరి మూడు వికెట్లను పడగొట్టి, ఇన్నింగ్స్‌లో మొత్తం 5 వికెట్లు (5/56) సాధించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 10వ ఐదు వికెట్ల ప్రదర్శన. దీంతో నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనలో సౌత్ జోన్‌కు ఓపెనర్ రికీ భుయ్ (42) దూకుడైన