© 2026 nimisham.in

Apple| ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్ (John Ternus)కు సంస్థ భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది.
వార్షిక వేతనం, షేర్ల రూపంలో లభించే ప్రోత్సాహకాలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరానికి ఆయన మొత్తం 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.551 కోట్లు) అందుకోనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న టిమ్ కుక్కు సుమారు 47 మిలియన్ డాలర్లు (సుమారు రూ.446 కోట్లు) అందనున్నాయి. ఈ వివరాలను అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన నివేదికలో యాపిల్ వెల్లడించింది.
టెర్నస్‌కు 3 మిలియన్ డాలర్లు వార్షిక మూల వేతనం కాగా.. మరో 55 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు అందనున్నాయి. ఆ స్టాక్‌లో 75 శాతం యాపిల్ షేరు పనితీరుతో ముడిపడి ఉంటుంది. మిగతా 25 శాతం కాలానుగుణంగా ఆయనకు దక్కుతుంది. మరోవైపు కుక్కు 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం.. 2027 ఆర్థిక సంవత్సరానికి 45 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు అందనున్నాయి.
సెప్టెంబరు 1న జాన్ టెర్నస్ యాపిల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2001లో యాపిల్ సంస్థలో చేరిన టెర్నస్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ తదితర ఉత్పత్తుల హార్డ్‌వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.