
ఓజీ యూనివర్స్ ’.. చాలా పెద్దప్లానింగే బాసూ
ఇంటర్నెట్ డెస్క్: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులకు ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్ సైన్ (Sujeethsign) సర్ప్రైజ్ ఇచ్చారు. ‘ఓజీ యూనివర్స్’(OGUniverse) పేరిట ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. అందులో ‘ఓజీ’కి సీక్వెల్‌గా తెరకెక్కించే చిత్రం గురించి పవన్ కల్యాణ్‌తో సుజీత్, సంగీత దర్శకుడు తమన్ చేస్తున్న చర్చలు ఆస్తకి రేపుతున్నాయి. ‘యాన్ ఇండియన్ ఆరిజిన్.. సౌత్ఈస్ట్ ఎమోషన్.. వెస్ట్రన్ ప్రెజెంటేషన్..’ అనే మాటలు, అందులో సమురాయ్‌గా పవన్ పాత్ర బాడీ లాంగ్వేజ్, ఆయుధాలు చూస్తే, ‘ఓజీ’ సీక్వెల్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే సుజీత్ పెద్ద ప్లానింగే చేస్తున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు జీవిత కథ ఇప్పుడు సినిమాగా రానుంది
